బీజేపీకి 300 సీట్లు ఖాయం | BJP MLC Ramachandra Fire On KCR | Sakshi
Sakshi News home page

బీజేపీకి 300 సీట్లు ఖాయం

May 16 2019 8:42 PM | Updated on May 16 2019 8:50 PM

BJP MLC Ramachandra Fire On KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చంద్రబాబు నాయుడు, సీఎం కేసీఆర్‌ ఇద్దరూ ఓటమికి భయపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు మండిపడ్డారు. గురువారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కోర్ కమిటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు ప్రణాళిక మీద ఈ సమావేశంలో చర్చించామని అన్నారు. అనంతరం రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ... పశ్చిమ బెంగాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా మీద జరిగిన దాడిని కోర్ కమిటీ తీవ్రంగా ఖండించిందని తెలిపారు.

మమతా బెనర్జీ.. ఒక ప్రధాన మంత్రి మోదీని సైతాన్, రౌడీ అనడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 300 పైగా సీట్లుతో బీజేపీ గెలుస్తుందని అన్నారు. తెలంగాణలో రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయంగా సీట్లు, ఓట్లు పెంచుకుంటుంది. కేసీఆర్‌ ప్రభుత్వం మీద.. పోరాటాలు తయారు చేస్తున్నామని చెప్పారు. ఇంటర్ విద్యార్థుల వ్యవహారం లో.. ఉద్యమం కొనసాగుతుంది. త్వరలోనే హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలుస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement