'టీఆర్‌ఎస్‌ తాటాకు చప్పుళ్లకు భయపడం' | BJP Leader Laxman Slams KCR Govt | Sakshi
Sakshi News home page

'టీఆర్‌ఎస్‌ తాటాకు చప్పుళ్లకు భయపడం'

Feb 28 2018 4:32 PM | Updated on Aug 15 2018 9:48 PM

BJP Leader Laxman Slams KCR Govt - Sakshi

ప్రధాని నరేంద్రమోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ మాట్లాడే తీరు పరాకాష్టకు చేరిందని విమర్శించారు. కేంద్ర నిధులను పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నాలుగు సంవత్సరాలు నిద్రమత్తులో ఉండి ఇప్పుడు మాటల గారడీ చేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడం తప్ప ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై లెక్కలు చూపాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ ద్రోహులకు.. మజ్లిస్‌ లాంటి మతోన్మాద పార్టీల కోసం టీఆర్‌ఎస్‌ పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ సమస్యల సంగతి ఏమైందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ తాటాకు చప్పుళ్లకు తాము భయపడమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement