‘వినతి పత్రం ఇవ్వబోతే అరెస్టులా?’

BJP General Secretary Muralidhar Rao Reacts On TS BJP Leaders Arrests - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కణ చేయడంపై బీజేపీ శ్రేణులు మంగళవారం చేపట్టిన ‘ఛలో ప్రగతిభవన్‌’ ఆందోళనలో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు జి.కిషన్‌ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సీనియర్‌ నాయకుడు బద్దం బాల్‌రెడ్డిని అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు.

సీఎం కేసీఆర్‌ను కలిసి వినతి పత్రం అందిద్దామని బయల్దేరిన నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. అరెస్టులతో తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలు పతనమవుతున్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు సమయం ఇవ్వకపోగా ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం కేసీఆర్‌ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. తెలంగాణలో సాగుతున్నది ప్రజాస్వామ్య పాలనా లేక నిజాం నిరంకుశ పాలనా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్‌లో తెలంగాణ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top