కన్యాకుమారి.. వరించేదెవరిని!

BJP-Congress Lock Horns in Kanyakumari - Sakshi

కన్యాకుమారి

తీర ప్రాంతంలో బీజేపీ–కాంగ్రెస్‌ సై

బీజేపీ తమిళనాడులో 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం కన్యాకుమారి. ఇక్కడ నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌.. కాంగ్రెస్‌ ప్రత్యర్థి హెచ్‌.వసంతకుమార్‌ను 1.28 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. వీరిద్దరే మళ్లీ తలపుడుతున్నారు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమిలో బీజేపీ, డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌ చేరడంతో ఈ రెండు ప్రధాన ప్రాంతీయ పక్షాలు పోటీలో లేవు.

నియోజకవర్గం ఏర్పడ్డాక జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి జే హెలెన్‌ డేవిడ్‌సన్‌.. బీజేపీ అభ్యర్థి పొన్‌ రాధాకృష్ణన్‌ను 65 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో బీజేపీ బలపడుతోంది. ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లున్న కన్యాకుమారి స్థానంలో 15 లక్షల మందికి పైగా ఓటర్లున్నారు. పోలింగ్‌ గురువారం జరగనుంది. నియోజకవర్గాల పునర్విభజనలో నాగర్‌కోయిల్‌ స్థానం రద్దయి 2009లో కన్యాకుమారి ఏర్పాటైంది. ప్రస్తుతం ఇక్కడ రెండు జాతీయ పక్షాల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉందనీ, గెలుపుపై జోస్యం చెప్పడం కష్టమని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

1999లో నాగర్‌కోయిల్‌ నుంచి రాధాకృష్ణన్‌..
1999 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. ఈ ఎన్నికల్లో పొన్‌ రాధాకృష్ణన్‌ నాగర్‌కోయిల్‌ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. 2004 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన సీపీఎం అభ్యర్థి ఏవీ బెలార్మిన్‌ చేతిలో ఓడిపోయారు. కన్యాకుమారి నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో ఉన్న బీసీ వర్గం నాడార్‌ కులానికి చెందిన రాధాకృష్ణన్‌ జనాదరణ కలిగిన నాయకుడు. నియోజకవర్గంలోని 19 లక్షల జనాభాలో సగం మంది హిందువులు. క్రైస్తవులు 40–45 శాతం వరకు ఉన్నారు. ఎన్నికల్లో మతపరమైన విభజన బీజేపీకి అనుకూలాంశం.

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న రాధాకృష్ణన్‌ 2013లో ఈ ప్రాంతంలోని పేద హిందువులందరికీ స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలంటూ సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. ధనికులైన మైనారిటీలకు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నారనీ, హిందువులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఈ ఆందోళన ఉధృతంగా సాగింది. మంత్రి అయ్యాక రాధాకృష్ణన్‌ ఈ విషయంలో చేసిందేమీ లేదనే అసంతృప్తి స్థానికుల్లో ఉంది. మత్స్యకారులు తమ ఉత్పత్తులను కొచ్చి, తూత్తుకుడి వంటి దూర ప్రాంతాలకు పంపే అవసరం లేకుండా వారి కోసం కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యం కల్పిస్తానని బీజేపీ అభ్యర్థి హామీ ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే–కాంగ్రెస్‌ హవా
2016 అసెంబ్లీ ఎన్నికల్లో కన్యాకుమారి పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లను డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి కైవసం చేసుకుంది. రెండు పార్టీలూ మూడేసి స్థానాలు గెలుచుకున్నాయి. పేదలకు నెలకు రూ.6 వేల సహాయ పథకంతోపాటు తనను గెలిపిస్తే వ్యవసాయ, విద్యా రుణాలు మాఫీ చేయిస్తానని కాంగ్రెస్‌ అభ్యర్థి వసంత కుమార్‌ ప్రస్తుత ఎన్నికల్లో హామీ ఇస్తున్నారు. వసంతకుమార్‌ కూడా నాడార్‌ వర్గానికి చెందిన నాయకుడే. నియోజకవర్గంలో టెక్నోపార్క్‌ ఏర్పాటు చేయిస్తానని ఆయన వాగ్దానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచీలున్న రిటైల్‌ సంస్థ వసంత్‌ అండ్‌ కంపెనీ స్థాపకుడైన వసంత్‌కుమార్‌ ఈసారి గెలుపునకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు
► సగం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నా గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ సంక్షోభం కుంగదీస్తోంది. రైతులకు మేలు చేసే విధానాలు అమలు చేయకపోవడంతో గిట్టుబాటు ధరలు లేక వారు అల్లాడుతున్నారు. జీడిపప్పు దిగుమతి నిబంధనలు సడలించడంతో ఈ రంగంలోని ఫ్యాక్టరీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.

► రహదారుల విస్తరణతో వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గిపోతోంది. జలవనరులు కుంచించుకుపోతున్నాయి. ఇవన్నీ ఎన్నికల్లో చర్చకు వస్తున్నాయి.

► ఎన్డీఏ సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కోలాచల్‌లో ఏర్పాటు చేస్తామన్న కంటెయినర్‌ టెర్మినల్‌ ప్రాజెక్టును అధికారంలోకి వచ్చాక సమీపంలోని ఇనాయంకు తరలించారు. తమ జీవనోపాధికి ఈ ప్రాజెక్టు నష్టదాయకమంటూ స్థానిక మత్స్యకారులు ఆందోళన చేశారు. చివరికి ఈ ప్రాజెక్టును కోవలంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కాని, కోలాచల్, ఇనాయం, తెంగైపట్టినం వంటి తీర ప్రాంతాల్లోని  క్రైస్తవులైన లక్ష మందికి పైగా మత్స్యకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

► రాధాకృష్ణన్‌కు కన్యాకుమారి, నాగర్‌కోయిల్‌లో చెప్పుకోదగ్గ బలం ఉంది. తీర ప్రాంతాల్లో బీజేపీ మద్దతుదారుల సంఖ్య తక్కువ. తన గెలుపు తీర ప్రాంత ప్రజల తీర్పుపై ఆధారపడి ఉండటంతో ఈ ప్రాంత ప్రజల సమస్యలు ఈసారి తప్పక పరిష్కరిస్తానని బీజేపీ అభ్యర్థి హామీ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

25-05-2019
May 25, 2019, 07:37 IST
కంటోన్మెంట్‌: లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఇద్దరు మంత్రులకు షాక్‌ ఇచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమారుడు సాయికిరణ్‌ యాదవ్‌...
25-05-2019
May 25, 2019, 07:26 IST
సాక్షి నెట్‌వర్క్‌:  సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా వెల్లడైన మూడు లోక్‌సభ, మూడు శాసనసభ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం...
25-05-2019
May 25, 2019, 07:25 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులు తెస్తానని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు...
25-05-2019
May 25, 2019, 06:49 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. నియోజకవర్గాలు, పోలింగ్‌ బూత్‌లలో వచ్చి న ఓట్ల...
25-05-2019
May 25, 2019, 06:48 IST
రాయవరం (మండపేట) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తు‘ఫాన్‌’తో అడ్రస్‌ లేకుండాపోయిన తెలుగుదేశం పార్టీపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ...
25-05-2019
May 25, 2019, 04:58 IST
సాక్షి, హైదరాబాద్‌:  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి శుభదినాలు మొదలయ్యాయని ప్రముఖ సినీ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. వైఎస్‌...
25-05-2019
May 25, 2019, 04:53 IST
‘ఈసారి ప్రధానిగా మోదీ కాకుంటే మరెవరు?’.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సామాన్య ప్రజల్లో వినిపించిన ఈ ప్రశ్నకు ప్రతిపక్షాల నుంచి...
25-05-2019
May 25, 2019, 04:51 IST
నిరంకుశ నిర్ణయాలు, అవినీతి వ్యవహారాలు, చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో పరాభవం భారంతో టీడీపీ అధినాయకత్వం పట్ల అసమ్మతి జ్వాలలు...
25-05-2019
May 25, 2019, 04:33 IST
న్యూఢిల్లీ: సరిగ్గా ఐదు నెలల క్రితం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది....
25-05-2019
May 25, 2019, 04:04 IST
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో టీడీపీలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఓటమి భారాన్ని దిగమింగుకోలేక, ఎలా ముందుకెళ్లాలో తెలియక పార్టీ...
25-05-2019
May 25, 2019, 03:34 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు సగం (49.95 శాతం) ఓట్లు ‘ఫ్యాన్‌’ ఖాతాలో పడ్డాయి....
25-05-2019
May 25, 2019, 03:26 IST
లక్నో: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని నిలువరించాలనుకున్న ప్రతిపక్షాలకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం...
25-05-2019
May 25, 2019, 03:17 IST
సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఎంపీల సంఖ్య 78గా ఉంది. అంటే మొత్తం లోక్‌సభ...
25-05-2019
May 25, 2019, 03:11 IST
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఏకంగా 303 సీట్లు తన...
25-05-2019
May 25, 2019, 02:36 IST
బెంగళూరు: ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి నాయకత్వంపై తమకు విశ్వాసం, నమ్మకం ఉన్నాయని కర్ణాటక కేబినెట్‌ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల...
25-05-2019
May 25, 2019, 02:06 IST
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక సంఘం (సీడబ్ల్యూసీ) భేటీ శనివారం ఉదయం 11 గంటలకు జరగనుందని పార్టీ...
25-05-2019
May 25, 2019, 02:02 IST
న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా రంగం సిద్ధమయ్యింది. శుక్రవారం సమావేశమైన కేంద్ర కేబినెట్‌ 16వ లోక్‌సభ రద్దుకు...
25-05-2019
May 25, 2019, 01:19 IST
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎప్పటికైనా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించే సత్తా ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే ఉందని పీసీసీ అధ్యక్షుడు...
25-05-2019
May 25, 2019, 01:14 IST
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: ఇష్టానుసారంగా.. తాము ఏం చేసినా.. ప్రజలు ఆమోదిస్తారన్న పాలకుల నిరంకుశ వైఖరిపై ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటుతో...
24-05-2019
May 24, 2019, 20:31 IST
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో షాకులపై షాక్‌లు కనిపిస్తున్నాయి. మొత్తం 28 సీట్లలో 25 సీట్లను...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top