ఏం చేస్తారో..? ఆ నలుగురు

BJD looking to win in by election - Sakshi

బిజేపూర్‌ ఉపఎన్నికపై బీజేడీ కార్యాచరణ

పార్టీ ప్రముఖులకు బాధ్యతలు

భువనేశ్వర్‌: బిజేపూర్‌ ఉపఎన్నికకు అధికార పక్షం బిజూ జనతా దళ్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికలో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రత్యర్థుల వ్యూహాత్మకచర్యల్ని పటిష్టంగా ఎదుర్కొనేందుకు బిజూ జనతా దళ్‌ పకడ్బందీ సన్నాహాలు చేస్తోంది. ఉప ఎన్నిక ఆద్యంతాల్లో ప్రత్యర్థులు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడి ఓటరును తప్పుదారి పట్టించకుండా చేసేందుకు పార్టీ వ్యూహాత్మక కార్యాచరణ ఖరారు చేసింది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయిన నాటినుంచి ఎంటి మీద కునుకు లేకుండా అధికార పార్టీ వర్గాలుశ్రమిస్తున్నాయి. బిజేపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ను సొంతం చేసుకునేందుకు బీజేడీ యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తోంది.

ఈ నేపథ్యంలో 3 అంచెల్లో పరిశీలకులు, పర్యవేక్షకుల్ని నియమించింది. అసెంబ్లీ, సమితి, పంచాయతీ స్థాయిలో పర్యవేక్షక బృందం కృషి చేస్తోంది. వీరితో పాటు ఒక్కో స్థానిక నాయకుడు ప్రతి 10 కుటుంబాలకు బాధ్యత వహించేందుకు వ్యూహాత్మక పరిశీలన ఏర్పాట్లను బీజూ జనతా దళ్‌ పూర్తి చేసింది. ఈ వ్యవహారాలకు పార్టీ నుంచి ఎంపిక చేసిన నలుగురు ప్రముఖుల్ని బీజేడీ ఖరారు చేసింది. వీరిలో సుశాంత సింగ్‌,సంజయ్‌ కుమార్‌ దాస్‌ వర్మ, ప్రణబ్‌ ప్రకాశ్‌ దాస్‌, నిరంజన్‌ పూజారి ఉన్నారు. మంత్రి సుశాంత్‌ సింగ్‌, ప్రణబ్‌ ప్రకాశ దాస్‌ బిజేపూర్‌ సమితి వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారు. బర్‌పాలి సమితిబాధ్యతల్ని మాజీ మంత్రి సంజయ్‌ కుమార్‌ దాస్‌ వర్మకు కేటాయించగా గైసిలేట్‌ సమితి బాధ్యతల్ని మంత్రి నిరంజన్‌ పూజారికి కేటాయించారు.

ఎంఎల్‌ఏలకూ పనే
వీరితోపాటు పార్టీ ఎమేల్యేలంతా వరుస క్రమంలో బిజేపూర్‌ నియోజకవర్గాన్ని ప్రత్యేక్షంగా సందర్శించేందుకు పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆదేశించారు. వీరంతాఅసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ప్రతి పంచయతీని సందర్శిస్తారు. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ఆధీనంలో కొనసాగిన బిజేపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పాగా వేసేందుకు కాంగ్రెస్‌తో ఉభయ బిజూజనతా దళ్‌, భారతీయ జనతా పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్‌ ఇంతవరకు తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు. గాలింపు కొనసాగిస్తోంది.

ప్రతి పంచాయతీపై గట్టి నిఘా
బిజేపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ప్రతి పంచాయతీపై ఎమ్మెల్యేలంతా గట్టి నిఘా వేయాలని పార్టీ అధ్యక్షుడు ఆదేశించారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో  59 పంచాయతీలు ఉన్నాయి.ఒక్కో పంచాయతీ బాధ్యతను ఒక్కో ఎమ్మెల్యేకి కేటాయించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ప్రతి పంచాయతీని ప్రత్యక్షంగాసందర్శించేందకుకార్యక్రమం ఖరారు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top