‘కనీస సంస్కారం లేని వ్యక్తి చంద్రబాబు’ | Bhumana Karunakar Reddy Critics CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Oct 26 2018 1:19 PM | Updated on Oct 26 2018 1:57 PM

Bhumana Karunakar Reddy Critics CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి నిప్పులు చెరిగారు. సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్‌ జగన్‌ను పరామర్శించేందుకు హైదరాబాద్‌ వచ్చిన భూమన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగితే కనీసం పరామర్శించే సంస్కారం లేని వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని విమర్శలు గుప్పించారు. ‘వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడి డ్రామా’ అని వ్యాఖ్యానిస్తున్న చంద్రబాబు మానవ మృగంలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థి దశ నుంచే చంద్రబాబుకు నేర చరిత్ర ఉందని విమర్శలు గుప్పించారు. వంగవీటి రంగా హత్య కుట్రలో చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. చంద్రబాబు గతం, వర్తమానం రెండూ రక్తసిక్తమేనని అన్నారు. (వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం!)

వైఎస్‌ రాజా రెడ్డిని హత్య చేయించిందికూడా చంద్రబాబేనని భూమన వ్యాఖ్యానించారు. వైఎస్‌ రాజారెడ్డిని హత్య చేసిన హంతకులకు బాబు నెల రోజులు ఆశ్రయమిచ్చారని అన్నారు. అలాంటి వ్యక్తి నేడు శాంతి వచనాలు వల్లించడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. కుల రాజకీయాలకు చంద్రబాబు ఆద్యుడని అన్నారు. ఎన్‌కౌంటర్‌ పత్రికాధిపతి పింగళి దశరథ్‌రామ్‌ హత్యలో కూడా చంద్రబాబు ప్రమేయముందని భూమన ఆరోపించారు. 2003 అలిపిరి ఘటనను అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయని గుర్తు చేశారు. ఆనాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి చంద్రబాబును పరామర్శించి, దాడిని ఖండించారని అన్నారు.

(జగన్‌పై దాడి..అంతా డ్రామా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement