
సాక్షి, ఖమ్మం : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 32వ వర్దంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. కరువు కోరల్లో చిక్కుకున్న భారతావనిని హరిత విప్లవంతో సస్యశ్యామలం చేసిన దార్శనికుడు జగ్జీవన్ రామ్ అని భట్టి కొనియాడారు. రైల్వే మంత్రిగా ఆధునీకరణకు తొలి అడుగులు వేసి రవాణా వ్యవస్థకు కొత్త జవసత్వాలు కల్పించిన మార్గదర్శి అని జగ్జీవన్ రామ్ అని ప్రశంసించారు.