పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలి!

BC Leader R Krishnaiah Moves High Court Over BC reservations in Panchayati Elections - Sakshi

హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ఆర్‌ కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్‌ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయమై హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ బీసీ సంఘం నేత ఆర్‌ కృష్ణయ్య మంగళవారం హైకోర్టులో హౌజ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌ను ప్రభుత్వం 34 శాతం నుంచి 22శాతానికి తగ్గించిందని, ఈ నేపథ్యంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నెల మూడో తేదీన (గురువారం) తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్‌ అంశంపై కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top