కరోనా కంటే ఆ వైరస్‌ ప్రమాదకరం..

Babul Suprio Says We Will Fighting With Didi Virus In Bengal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో తాము కరోనా వైరస్‌ కంటే ప్రమాదకర వైరస్‌తో పోరాడుతున్నామని కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో అన్నారు. మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కార్‌తో పోరాటం ప్రాణాంతక వైరస్‌పై పోరు కంటే అధికమని వ్యాఖ్యానించారు. బెంగాలీలను అవమానపరిచి, వారిని వైరస్‌ బారిన పడవేసే ముందే మమతా బెనర్జీ అధికార పీఠం నుంచి వైదొలగాలని అన్నారు. దీదీ వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీలు పశ్చిమబెంగాల్‌లో పనిచేయడం ప్రారంభించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాగా లాక్‌డౌన్‌ అమలును పర్యవేక్షించేందుకు పశ్చిమబెంగాల్‌కు కేంద్ర బృందాలను పంపడాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకించారు. కరోనా కేసులు అధికంగా ఉన్న ఇతర రాష్ట్రాలను విస్మరించి బెంగాల్‌కే ఎందుకు కేంద్ర బృందాలను పంపారని ఆమె నిలదీశారు. తమ రాష్ట్రానికే ఎందుకు కేంద్ర బృందాలను పంపారో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వివరణ ఇవ్వాలని ఆమె పట్టుబట్టారు. అప్పటివరకూ కేంద్ర బృందాలకు సహకరించబోమని దీదీ పేర్కొన్నారు.

చదవండి : మమత మరో తీపికబురు..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top