కుష్టువ్యాధి నివారణపై సీరియస్‌గా దృష్టి పెట్టాలి

AP CM YS Jagan Mohan Reddy About Aarogyasri AP Collectors Conference - Sakshi

సాక్షి, అమరావతి : ఇక మీదట ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు వచ్చి పిల్లల్ని కొరకడం.. టార్చిలైట్ల వెలుగులో ఆపరేషన్లు చేయడం వంటి సంఘటనలు పునరావృతం కాకుడదన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్‌ ఆస్ప్రత్రులకు రూ. 450 కోట్ల బకాయిలున్నాయి అన్నారు. గత ప్రభుత్వం 9 నెలల నుంచి బకాయిలు చెల్లించలేదని.. వీలైనంత త్వరగా వాటిని చెల్లించాలని జగన్‌ ఆదేశించారు.

కుష్టువ్యాధి వాళ్లకు ఎంత పెన్షన్‌ ఇస్తున్నారని జగన్‌ ప్రశ్నించారు. కుష్టువ్యాధి మళ్లీ విజృంభిస్తున్నట్లు పాదయాత్ర సమయంలో తన దృష్టికి వచ్చిందన్నారు. కుష్టువ్యాధి నివారణ, మందులు, చికిత్స తదితర అంశాలపై సీరియస్‌గా దృష్టిపెట్టాలని జగన్‌ కలెక్టర్లను ఆదేశించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top