‘40 ఏళ్ల అనుభవం కాదు.. సంస్కారం ఉండాలి’

AP Chief Whip Gadikota Srikanth Reddy Slams Chandrababu Naidu - Sakshi

చంద్రబాబుపై చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ఫైర్‌

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనసభలో రెండోరోజు ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపక్ష సభ్యుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నలభయ్యేళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు సంస్కారం మాత్రం కరువైందని ఎద్దేవా చేశారు. సున్నావడ్డీ రుణాల పథకంపై సభలో గురువారం 4 గంటలకు పైగా చర్చ జరిగిందని ఇవాళ మళ్లీ కాకిలెక్కలు తీసుకొచ్చి టీడీపీ సభ్యులు గొప్పలు చెప్పుకునేందుకు యత్నిస్తున్నారని అన్నారు. టీడీపీ సభ్యులు ఈ పద్ధతి మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తమపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని, చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని సభదృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ వద్ద లెక్కలులేకే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top