
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఇక సినిమాలు చేసుకోవచ్చని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ హితవు పలికారు. నెల్లూరు నగరంలోని కోనేటిమిట్టలో సోమవారం పర్యటించిన మంత్రి.. ఆదివారం విశాఖలో జరిగిన లాంగ్‌మార్చ్.. ఆ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన బాగుంటే సినిమాలు ఒప్పుకుంటానని పవన్‌కల్యాణ్ చెప్పిన విషయాన్ని అనిల్‌కుమార్ గుర్తుచేశారు. ప్రస్తుతం పవన్ పింక్ అనే రీమేక్ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయని.. దీనిని బట్టి చూస్తే వైఎస్ జగన్ పాలన బాగుందని ఆయన ఒప్పుకున్నట్లేనన్నారు. ఇసుకపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడంపై మంత్రి మండిపడ్డారు.