పెట్టుబడుల ఆకర్షణలో పడిపోయిన ఏపీ ర్యాంక్‌

Andhra Pradesh Rank Seven In State Investment Potential Index - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెట్టుబడుల ఆకర్షణ జాతీయ ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ర్యాంక్‌ మరింత దిగజారింది. గత ఏడాది కంటే నాలుగు స్థానాల దిగువకు పడిపోయి 7వ ర్యాంక్‌కు చేరింది. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్‌ ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడైంది.

దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ వరసగా 7, 8 స్థానాల్లో నిలిచాయని మంత్రి చెప్పారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఏపీ నాలుగు ర్యాంకుల కిందకు పడిపోయిందని రాధాకృష్ణన్‌ వివరించారు. 2016లో 4వ ర్యాంక్‌, 2017లో 3వ ర్యాంక్‌ సాధించిన ఆంధ్రప్రదేశ్‌.. 2018 నాటికి నాలుగు స్థానాలు దిగజారి 7వ ర్యాంక్‌కు చేరిందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు సుశిక్షితులైన శ్రామిక శక్తి, మౌలిక వసతుల లేమి, వ్యాపార, వాణిజ్యాలలో ఏర్పడ్డ ప్రతికూల వాతావరణమే ఏపీ ర్యాంక్‌ పడిపోవడానికి కారణమని మంత్రి వివరించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top