ఆప్‌ తీరుపై అల్కా లంబా విమర్శలు

AAP MLA Alka Lamba Says She Is Being Sidelined In The Party - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆమ్‌ ఆద్మీ పార్టీకి నా సేవలు అవసరం లేనట్లుగా అనిపిస్తోంది’ అని చాందినీ చౌక్‌ ఎమ్మెల్యే అల్కా లంబా వ్యాఖ్యానించారు. పార్టీ అధిష్టానం తనను పక్కన పెట్టాలని చూస్తోంది అని ఆరోపించారు. ‘పార్టీ వాట్సాప్‌ గ్రూపుల నుంచి నా నెంబర్‌ తొలగించడం. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విటర్‌లో నన్ను అన్‌ఫాలో అవడం. పార్టీ మీటింగ్‌లకు ఆహ్వానించకపోవడం చూస్తుంటే పొమ్మనలేక పొగ పెట్టినట్లుగా ఉంది. మిగతా ఎమ్మెల్యేలలాగా నాకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి కదా. అలా జరగని పక్షంలో నేను ఈ పార్టీలో కొనసాగలేను. నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేను’ అని అల్కా లంబా పార్టీ తీరును విమర్శించారు.

కాగా సిక్కు వ్యతిరేక అల్లర్లలో రాజీవ్‌ గాంధీపై కూడా ఆరోపణలు ఉన్నాయని, ఆయనకిచ్చిన దేశ అత్యున్నత పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ అసెంబ్లీ తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆల్కా లంబా పేర్కొన్నారు. దీంతో ఆమె పార్టీని వీడనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారమవుతున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top