ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సోమవారం పర్యటించారు.

అల్లర్లతో అట్టుడికి, ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటున్న ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సోమవారం పర్యటించారు.

అల్లర్ల బాధితులు తలదాచుకుంటున్న బాసి కలాన్ సహాయక శిబిరాన్ని సందర్శించి, బాధితులతో మాట్లాడారు.

వారిని ఓదార్చారు.సహాయక శిబిరంలో వారికి అందుతున్న సహయ చర్యల గురించి వాకబు చేశారు.

బాధితులను ఆదుకోవడానికి అవసరమైతే కేంద్ర సహాయం చేస్తుందని.. ప్రధాని మన్మోహన్‌సింగ్ వారికి హామీ ఇచ్చారు.

ప్రశాంత వాతావరణం నెలకొనటానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలు సహకరిస్తుందన్నారు.

ఈ సందర్భంగా ఇరు వర్గాలకు చెందిన బాధితులు ప్రధానికి తమ వినతి పత్రాలను అందజేశారు.

తమపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.



