పోటెత్తిన ఢిల్లీ ఓటరు చైతన్యం , అనూహ్యం - అమేయం - అజేయం
పోటెత్తిన ఢిల్లీ ఓటరు చైతన్యం
అనూహ్యం - అమేయం - అజేయం
గుండెల్లో గూడుకట్టుకున్న
ఓటరు నిట్టూర్పు
అంచనాలకు అందని
ఈ సంచలనాత్మక తీర్పు
అధికార లాలస అగ్రనేతల
ఆశలకు అశనిపాతం
నూటపాతికేళ్ల కాంగీ నేతల బాధ
కడు శోచనీయం
కేజ్రీవాలా పట్ల ఢిల్లీ ఓటర్లకెంతో క్రేజు
నేతల అవినీతి ఊడ్చేస్తాడన్న మోజు
అందుకే ఢిల్లీ పీఠానికి చేరారు రాజు
హ్యాట్సాఫ్ టు
ప్రలోభాలకు లొంగని ఓటరుకు!
ఇదే ప్రజాస్వామ్యానికి ఉన్న పవర్
కంగ్రాట్స్ టు సి.ఎం. కేజ్రీవాల్ లీడర్
- డా. పి.వి. సుబ్బారావు , చిలకలూరిపేట, గుంటూరు జిల్లా