ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీ ఆర్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి కమిటీ ఉపాధ్యక్షులు, ప్రముఖ హైకోర్టు న్యాయ వాది వి. నారాయణరెడ్డి మార్చి నెల 23న తన 51వ ఏట హైదరాబాద్‌లో ఆకస్మికంగా మరణిం చారు.
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీ ఆర్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి కమిటీ ఉపాధ్యక్షులు, ప్రముఖ హైకోర్టు న్యాయ వాది వి. నారాయణరెడ్డి మార్చి నెల 23న తన 51వ ఏట హైదరాబాద్‌లో ఆకస్మికంగా మరణిం చారు. ఆయన మరణం కుటుంబానికే కాక, పౌర, ప్రజాస్వామ్య, ప్రజాతంత్ర ఉద్యమాలకు తీవ్ర నష్టం. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నరసారెడ్డి పాలెంలో సన్నకారు రైతు కుటుంబంలో 08-06- 1964న జన్మించిన నారాయణరెడ్డి కావలి జవహర్ భారతి కళాశాలలో విద్యాభ్యాసం సాగించే రోజు ల్లోనే విద్యార్థి ఉద్యమాలలో చురుకుగా పనిచే శారు. ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (డీఎస్‌ఓ)లో చేరి రాష్ట్ర నాయకత్వ స్థాయికి ఎదిగారు. నెల్లూరు వి.ఆర్. కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించి జిల్లా కోర్టు న్యాయవాదిగా ప్రాక్టీసు ఆరంభించారు. నెల్లూరు ఓపీడీఆర్ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర ఆర్గనై జింగ్ కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు.
జీవితాంతం పేదప్రజల పక్షాన నిలబడి పోరాడిన త్యాగశీలి నారాయణరెడ్డి. రాజ్యహింస కు, లింగ, కులవివక్షతకు, దళితులపై దాడులకు వ్యతిరేకంగా అనేక నిజనిర్ధారణ కమిటీల విచార ణల్లో పాల్గొన్నారు. బూటకపు ఎదురుకాల్పుల హత్యాకాండపై అనేక నిజనిర్ధారణ కమిటీలలో పాల్గొన్నారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాల దుస్థి తిపై, క్రెడిట్ కార్డుల మోసాలపై, శంషాబాద్ రైతు ల ఆత్మహత్యలపై, మియాపూర్ గుడిసెవాసులపై టాడా కేసు బనాయింపు వంటి అన్ని సమస్యల పైనా పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. దళితు లపై దాడుల కేసుల్లో న్యాయసహాయం అందించ డం, పేద ప్రజలకు వ్యతిరేకంగా వస్తున్న తీర్పుల్ని అధ్యయనం చేసి సభలు నిర్వహించడం, నిబద్ధత గల న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను అనువ దించి పత్రికలకు పంపేవారు. ఆయన కుటుంబ సభ్యులకు ఆయన స్వప్నించిన హక్కుల ఉద్యమా న్ని మరింత ముందుకు తీసుకుపోవడమే తనకు మనమిచ్చే నిజమైన నివాళి.
నారాయణరెడ్డి సంస్మరణ సభ ఏప్రిల్ 2 గురు వారం సాయంత్రం గం.5.30లకు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగనుం ది. ఓపీడీ ఆర్ ప్రధాన కార్యదర్శి వి.హనుమంత రావు అధ్యక్షతన జరిగే ఈ సభలో రిటైర్డ్ ఏపీ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ కె.జి శంకర్, రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, సీనియర్ అడ్వొకేట్ బొజ్జా తార కం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు, సీనియర్ అడ్వొకేట్ ఎన్.సైదారావు, స్త్రీ విముక్తి సంఘటన ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి, హెచ్.ఆర్.ఎఫ్. నాయకులు జీవన్‌కుమార్, సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ నాయకులు లతీఫ్ ఖాన్, సీఎల్‌పీ నాయకులు వి. రఘునాథ్, పీయూ సీఎల్ నాయకులు జయ వింధ్యాల, ప్రజా సంఘా ల నాయకులు, మిత్రులు, ఉద్యమ సహచరులు ప్రసంగిస్తారు. అందరికీ ఆహ్వానం.
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ
(ఓపీడీఆర్) రాష్ట్రకమిటీ