ఎమ్మెల్యే కారును ఢీకొని ఇద్దరు మృతి | MLA Kasireddy Car Incident | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కారును ఢీకొని ఇద్దరు మృతి

May 7 2024 3:54 AM | Updated on May 7 2024 9:53 AM

MLA Kasireddy Car Incident

వెల్జాల్‌ సమీపంలో ప్రమాదం

కారును ఢీకొన్న బైక్‌

ఒకరు అక్కడికక్కడే దుర్మరణం

మరొకరు హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి

ఎమ్మెల్యేకూ గాయాలు.. హైదరాబాద్‌లో చికిత్స

తలకొండపల్లి, కల్వకుర్తి /కల్వకుర్తి టౌన్‌: కల్వకుర్తి ఎమ్మెల్యే కసి రెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారు ఢీకొన్న ఘటనలో ద్విచ క్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. తలకొండపల్లి మండల పరిధి వెల్జాల్‌ సమీపంలో సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్క డికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. వివరాలి లా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే నారాయణ్‌రెడ్డి వెల్జాల్‌ నుంచి మిడ్జిల్‌ వెళ్తుండగా రామాసిపల్లి మైసమ్మ దేవాలయం వద్ద ఎదురుగా వచ్చిన బైక్‌ ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. 

బైక్‌ను తప్పించే క్రమంలో ఎమ్మెల్యే వాహనం రోడ్డు దిగి పొదల్లోకి దూసుకెళ్లింది.  ఈ ఘటనలో వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన పబ్బతి నరేశ్‌ (25) అక్కడిక్కడే మృతి చెందగా బైరపాక పరశురాం(35) గాయపడ్డాడు. అతన్ని చికిత్స కోసం వెల్దండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడినుంచి హైదరాబాద్‌కు తరలించగా పరిస్థితి విషమించి రాత్రి మృతి చెందాడు. ఎమ్మెల్యే కారులోని ఎయిర్‌ బ్యాగ్‌లు ఓపెన్‌ కావడంతో ఎమ్మెల్యేతో సహా మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement