సింగపూర్‌లో ఘనంగా శ్రీనివాస కల్యాణం | TTD Singapore Telugu Samajam conducts Srinivasa Kalyanam in Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో ఘనంగా శ్రీనివాస కల్యాణం

Oct 22 2019 5:47 PM | Updated on Oct 22 2019 5:58 PM

TTD Singapore Telugu Samajam conducts Srinivasa Kalyanam in Singapore - Sakshi

సింగపూర్ తెలుగు సమాజం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని సింగపూర్ లోని పాయ లేబర్, శ్రీ శివన్ దేవాలయం ప్రాంగణంలో జరిపించారు. మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రభాత సేవతో మొదలై ఏకాంత సేవ వరకు జరిగిన విశేషసేవలకు భారీగా భక్తులు తరలి వచ్చారు. సింగపూర్‌తో పాటు మలేషియా నుండి కూడా అనేకమంది భక్తులు వచ్చి తిరుమల ఉత్సవ అనుభూతిని పొందారు. కన్నుల పండగగా జరిగిన ఈ ఉత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు, చిన్నారుల నాట్యాలు, మహిళల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 


 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అతి తక్కువ సమయంలో అత్యంత వేడుకగా కళ్యాణమహోత్సవాన్ని చేయడంలో కీలక పాత్ర వహించిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గాన్ని కొనియాడారు. తిరుమల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడానికి టీటీడీ కార్యవర్గం చర్యలు తీసుకుంటుందన్నారు. విదేశాల నుండి వచ్చే భక్తుల కోసం మరింత శీఘ్రగతిన దర్శనం చేయిస్తామని హామీ ఇచ్చారు. 

టీటీడీ బోర్డ్ మెంబర్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. మాట్లాడుతూ సింగపూర్‌లో ఎన్నో దేవాలయాలు ఉండడం ఆనందంగా ఉందని, ఇక్కడి భారతీయుల భక్తి ఎంతో స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. ఈకార్యక్రమంలో సింగపూర్ హోమ్, న్యాయశాఖా మంత్రివర్యులు కె షణ్ముగం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ మంత్రివర్యులు యస్ ఈశ్వరన్, సింగపూర్ దేశ భారత రాయభారి జావెద్ అష్రాఫ్, హిందూ ఎండోమెంట్ బోర్డ్ ఛైర్మన్ ఆర్ జయచంద్రన్, శివన్ దేవాలయ సలహాదారు దినకరన్, శివన్ దేవాలయ ఛైర్మన్ వెంకటేష్, శివన్ దేవాలయ కార్యదర్శి టి అన్బలగన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ సావనీర్ ను ప్రముఖుల చేతులమీదుగా ఆవిష్కరించారు.


 
పుష్కర కాలం తర్వాత ఇలాంటి మహోన్నత కార్యక్రమాన్ని సింగపూర్‌లో నిర్వహించడానికి తోడ్పాటునందించిన టీటీడీ యాజమాన్యానికి, స్థానిక హిందూ ఎండోమెంట్ బోర్డు, శివన్  టెంపుల్ యాజమాన్యానికి సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సింగపూర్ భక్తులకి ఈ కార్యక్రమం ద్వారా కలగడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.


 
శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవంలో అహర్నిశలు శ్రమించిన కుటుంబ సమేత కార్యవర్గ సభ్యులు జ్యోతీశ్వర్ రెడ్డి కురిచేటి, నగేష్ టేకూరి, అనిల్ పోలిశెట్టి, సత్య సూరిశెట్టి, మల్లికార్జున్ పాలేపు,  వెంకట వినయ్ కుమార్ గౌరిరెడ్డి, ప్రదీప్ సుంకర, సిద్దా రెడ్డి నరాల, భూమ్ రాజ్ రుద్ర,  మహేష్ కాకర్ల, సోమా రవి కుమార్, ధర్మ వర ప్రసాద్ బచ్చు, సమ్మయ్య బోయిని, కాసయ్య మేరువ, స్వాతి కురిచేటి, విజయ చిలకల్, సుప్రియ కొత్త, వెంకట శివ రావు పులిపాటి, నరసింహ గౌడ్ పోతగౌని, శ్రీనివాస రెడ్డి పుల్లన్నగారి, నాగరాజు వడ్డి, ఫణింద్ర వర్మ కలిదిండి, అర్జున్ రావు జునెబోయిన లకు సింగపూర్ తెలుగు సమాజం గౌరవ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి చిర్ల దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడిన వాలంటీర్లకు, దాతలకు, సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరున తెలుగు సమాజం ఉపాధ్యక్షులు, కార్యక్రమ నిర్వాహకులు పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement