భారతసంతతి మహిళకి అమెరికాలో కీలక పదవి

Trump nominated Inidan american Rita barnwal for Top position - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో ఆధునిక అణు రియాక్టర్ల అభివృద్ధిని వేగవంతం చేయాలని నిర్ణయించిన కొద్ది రోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. అణుశక్తి రంగంలో నైపుణ్యం ఉన్న భారత సంతతికి చెందిన రీటా బరన్వాల్‌ని, అణుశక్తి విభాగంలో కీలకమైన అసిస్టెంట్‌ సెక్రటరీ పదవికి డొనాల్డ్‌ ట్రంప్‌ ఎంపిక చేశారు. ఈ మేరకు వైట్‌ హౌస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రీటా గేట్‌వే ఫర్‌ ఆక్సిలరేటెడ్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ న్యూక్లియర్‌ (జీఏఐఎన్‌)లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రీటా నియామక ప్రతిపాదనను సెనెట్‌ ఆమోదించాల్సి ఉంది. 

మెటీరియల్స్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో ఎంఐటీ (మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) నుంచి రీటా పట్టా పొందారు. మిచిగాన్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఎంఐటీ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌, బార్క్‌‌లీ అణు ఇంజినీరింగ్‌ విభాగాల సలహాదారుల బోర్డులో గతంలో సేవలందించారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top