దినసరి కార్మికులకు టీఆర్‌ఎస్‌ మలేషియా అండ

TRS Malaysia Help Daily Wagers Over Corona Lockdown - Sakshi

కౌలాలంపూర్‌ : లాక్‌డౌన్‌ కారణంగా మలేషియాలో చిక్కుకుని ఇక్కట్లు పడుతున్న దినసరి కార్మికులకు టీఆర్‌ఎస్‌ మలేషియా అండగా నిలిచింది. నిత్యావసర వస్తువులు అందించి వారి ఆకలి తీర్చింది. కొద్దిరోజులక్రితం సామాజికమాద్యమాల ద్వారా టీఆర్‌ఎస్‌ మలేషియా సభ్యులు సందీప్ కుమార్ లగిశెట్టి, శ్రీనివాస్ ముల్కల దృష్టికి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో ద్వారా బ్రతుకుదెరువు కోసం మలేషియా వచ్చి దినసరి  కార్మికులుగా పనిచేస్తూ లాక్‌డౌన్ కారణంగా ఎటూవెళ్లలేక, తినటానికి లేక ఇబ్బంది పడుతున్న తెలంగాణ వాసులను సామాజికసేవలో ముందుండే శ్రీకాంత్ గుర్తించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి టీఆర్‌ఎస్‌ మలేషియా అధ్యక్షులు చిట్టిబాబు చిరుత ఆధ్వర్యంలో  నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను వారికి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ మలేషియా చేసిన సహాయానికి సంతోషం వ్యక్తం చేశారు. మలేషియాలో ఇబ్బందుల్లో ఉన్న వారికి అన్ని సమయాల్లో సహాయ సహకారాలు అందించే టీఆర్‌ఎస్‌ మలేషియా దాతృత్వాన్ని కొనియాడారు.

అనంతరం అధ్యక్షులు చిట్టిబాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరోనా ఉధృతిని అడ్డుకునే నేపథ్యంలో కేసీఆర్ సమయస్ఫూర్తి, వ్యూహరచనలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో గడగడలాడుతున్న వేళ తెలంగాణ వాసుల యోగక్షేమాలు టీఆర్‌ఎస్‌ ఎన్నారై సమన్వయకర్త మహేష్ బిగాల చిట్టిబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అన్నివేళలా మేము ఉన్నామంటూ ధైర్యాన్నిస్తున్నారు.

నిధులు సమకూర్చడంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ,  కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు రమేష్ గౌరు, మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, హరీష్ గుడిపాటి, శ్రీనివాస్ ముల్కల, సాయి హేమంత్, రఘునాత్ నాగబండి, రవిందర్ రెడ్డి, ఇతర దాతలు, ఓంప్రకాష్ బెజ్జంకి, రాజ్ కుమార్ రాకం, సురేష్ రామడుగు, శ్రీ హరి సహకరించారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top