కేటీఆర్‌కు తానా ఆహ్వానం

Tana invites Ktr for Maha sabhalu - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలకు ముఖ్య అతిథులుగా విచ్చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. తానా మహాసభల అధ్యక్షుడు సతీశ్‌ వేమన, ప్రతినిధి ఎర్రబెల్లి ప్రేమ్‌చందర్‌రావు తానా సభల ఆహ్వాన పత్రికను వారికి అందించారు. జూలై 4 నుంచి జూలై 6 వరకు వాషింగ్టన్‌లో తానా సభలు అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సీహెచ్‌ మల్లారెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలకు కూడా ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top