వలస కూలీలకు ఎన్‌ఆర్‌ఐల బస్సు ఏర్పాటు

Nris help Migrant workers to reach their homes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీపీసీసీ పిలుపు మేరకు వివిధ దేశాలల్లో ఉన్న ఐఓసీ తెలంగాణ ఆధ్వర్యంలో ఒడిశాకి చెందిన వలస కూలీలకు హైదరాబాద్ నుండి స్వస్థలాలకు వెళ్లడానికి బస్సు ఏర్పాటు  చేశారు. గాంధీ భవన్‌లో  తెలంగాణ పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దాసోజు శ్రవణ్‌, టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ అధ్యక్షుడు వినోద్‌లు జెండా ఊపి బస్సు ప్రారంభించారు. దాదాపు 1400 కిలోమీటర్ల దూరప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు.

కాంగ్రెస్ పార్టీ తరపున యూకే, ఆస్ట్రేలియా, దుబాయ్‌లలో ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు, కార్మికులకు వసతి కల్పించామని టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ అన్నారు. నిత్యావసర సరుకులు ఇవ్వడం, భోజనాలు అందచేయడం, ఇళ్ల కిరాయిలు కట్టడం వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. వీటితో పాటు వలస కూలీలకు బస్సు ఏర్పాటు చేశామని తెలిపారు.   

బస్సు ఏర్పాటుకు సహకరించిన ఎన్‌ఆర్‌ఐలు 
1) గంప  వేణుగోపాల్  - లండన్
2) గంగసాని  రాజేశ్వర్  రెడ్డి  - అమెరికా 
3) యర్రంరెడ్డి  తిరుపతి  రెడ్డి - అమెరికా 
4) మన్యం  రాజశేఖర్ రెడ్డి - ఆస్ట్రేలియా
5) ఎస్వి రెడ్డి- దుబాయ్
  6) ప్రదీప్ సామల - అమెరికా
7)గంగసాని ప్రవీణ్  రెడ్డి - లండన్ 
8) రవీందర్ గౌడ్ - కెనడా
9) కొత్త రామ్మోహన్ రెడ్డి - లండన్ 
10) సుధాకర్ గౌడ్ - లండన్
11) బిక్కుమండ్ల రాకేష్ - లండన్
12) నీలా శ్రీధర్ - లండన్
13) పోటాటి శ్రీకాంత్ రెడ్డి - లండన్ 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top