మలేషియాలో ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు | KCR Birthday Celebrations By TRS Malaysia Federation In Malaysia | Sakshi
Sakshi News home page

మలేషియాలో ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

Feb 16 2020 7:47 PM | Updated on Feb 16 2020 7:49 PM

KCR Birthday Celebrations By TRS Malaysia Federation In Malaysia - Sakshi

మలేషియా : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన సందర్బంగా టీఆర్‌ఎస్‌ ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపు మేరకు మలేషియాలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మలేషియా ఎన్నారై విభాగం అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కట్‌చేశారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఫ్రీ ట్రీ సొసైటీ  ఆధ్వర్యంలో నాటింగమ్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. అనంతరం లైట్ హౌస్ చిల్డ్రన్ వెల్ఫేర్ హోం అసోసియేషన్ ని సందర్శించి అక్కడి చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కుర్మ మారుతి, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, రఘునాత్ నాగబండి, రవిందర్ రెడ్డి , హరీష్ గుడిపాటి, ముల్కల శ్రీనివాస్ , శ్యామ్ రాజారామ్, హేమంత్ సాయి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

1
1/3

2
2/3

3
3/3

Advertisement
 
Advertisement
Advertisement