
టెక్సాస్, హ్యూస్టన్ : ప్రవాస తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేక సంచిక 'పాలపిట్ట'ను తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి హ్యూస్టన్‌లో ఆవిష్కరించారు. ప్రపంచ తెలంగాణ మహా సభల సందర్భంగా ప్రచురించిన ఈ ప్రత్యేక సంచికలో రైతే రాజు, సినారే ఘన నివాళి, నాలుగేళ్ల తెలంగాణ, హ్యూస్టన్ తెలుగు భవనం, బోనాలు, బతుకమ్మ పండుగ, తెలంగాణంతో పాటు మరెన్నో విశేషాలు పొందుపరిచారు.
ఈ పుస్తక ప్రచురణకు ప్రొఫెసర్ సాంబరెడ్డి ముఖ్య సంపాదకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఎంపీ జితేందర్ రెడ్డి, ఎంపీ సీతారాం నాయక్, బీజేపీ నాయకులు కృష్ణ సాగర్ రావు, అమెరికా తెలంగాణ సంఘం కార్య వర్గం, తెలంగాణ రాష్ట్రం నుండి విచ్చేసిన పలువురు కళాకారులు పాల్గొన్నారు.