
కరీంనగర్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఫారహాద్దీన్ కువైట్‌లో మరణించారు. అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించారు. మహమ్మద్ ఫేరాజుద్దీన్ కువైట్‌లో డ్రైవర్‌గా పనిచేసేవాడు. మే 14న జరిగిన రోడ్డు ప్రమాదం అతను మృతిచెందారు. ఫారహాద్దీన్ మృతదేహాన్ని ఫ్లయిట్ నెం. అల్ జజీరా J9-403లో కువైట్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఉదయం 1.35గం.లకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. అతని బంధువు ఆసాఢహ్మద్ ఖాన్‌ను సిటీస్ బస్సు యాజమాన్యం అదే ప్లయిట్ లో శవపేటికతో పాటు పంపారు. వారి దగ్గరి బంధువు ఖాజా జాహీరోద్దీన్, సామాజిక కార్యకర్త శ్రీ స్వదేశ్ పరికిపండ్ల హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో శవపేటికను స్వీకరించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో చిట్టి బాబు నేతృత్వంలో అంబులెన్సును ఏర్పాటు చేశారు. మదదు పోర్టల్ ద్వారా, ఎంబసీ సహకారం తీసుకున్నారు. ఖాదర్ సిటీ బస్సు యాజమాన్యం తరపున సెటిల్మెంట్‌లో ఒకరిని ఇచ్చి పంపడంలో చాలా బాగా సహకరించింది. అతని మిత్రులు సర్వర్, అదిల్ సహకరించారు. శ్రీ భీం రెడ్డి, ఆ ఏరియా సీఐ త్వరగా వెంటనే స్పందించారు. ఈ మొత్తం పనిలో తెలంగాణ ప్రభుత్వం, సిటీ బాస్ యాజమాన్యం, ఇంటివారితో మాట్లాడం పనులు జరుగడంలో గంగుల మురళీధర్ రెడ్డి తన పని చేసారు. భవిష్యత్తులో ఇతని ఇన్సూరెన్సు కు కూడా కంపెనీ తో కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలిపారు.
మృతుడికి సంబంధించిన వివరాలు :
చిరునామా: ఇంటినెంబర్ 8-14-3/5, కృష్ణ నగర్, కళ్యాణి గార్డెన్ దగ్గర, బొమ్మకల్ (గ్రామం ), కరీంనగర్ జిల్లా