డల్లాస్‌ తెలంగాణ ప్రజాసమితి నూతన కార్యవర్గం ఎన్నిక

Dallas Telangana Praja Samithi New Committee Taking Oath - Sakshi

ఘనంగా ముగిసిన టీపాడ్ 2019 నూతన కార్యవర్గ బృందం ప్రమాణ స్వీకార కార్యక్రమం

డల్లాస్‌ : డల్లాస్‌ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్‌) 2019 నూతన కార్యవర్గ బృందం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా ముగిసింది. టీపాడ్‌ 2019 కమిటీ ఎన్నుకోబడిన కొత్త కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార సభ ప్లేనో నగరంలోని మినర్వా బాన్వ్కెట్‌ హాల్‌లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. డల్లాస్‌ ప్రాంతీయులు, అన్ని స్థానిక, తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు.

జనవరి 27, ఆదివారం 2019 డాలస్ టెక్సస్. డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) ఏప్రిల్, 2014లో స్థాపించబడి“ఇన్స్పిరేషన్ , ఇంటరాక్షన్ & ఇంక్లూషన్” అనే నినాదాన్ని అక్షర సత్యంగా అమలు పరుస్తూ అన్ని జాతీయ, స్థానిక సంస్థలతో, విభిన్న సామజిక సేవలలో తనదైన శైలితోఆర్థికంగా, కార్య క్రమాల పరంగా అండదండని యిస్తూ ముందుకు సాగుతుంది. ప్రతీ ఏటావేలాది డాలస్ నగర వాసులతో అతి పెద్ద బతుకమ్మ వేడుకలు మరియు అంబరాన్నంటే దసరా సంబరాలను జరుపుతూ పండగ ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనతని కైవసం చేసుకుంది.శాస్త్రీయ నృత్యాలకి, సంగీత మాధుర్యాలకి పెద్ద పీట వేస్తూ, ఎంతో మంది స్థానిక కళాకారులతో పాటు మాతృభూమి కళాకారుల కి ప్రోత్సాహం యివ్వడములో అగ్రస్థానాన్ని పుణికి పుచ్చుకున్న సంస్థ టీపాడ్‌.

2017 లో తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలతో అతి వైభవంగా బతుకమ్మ వేడుకలను జరిపామని తెలంగాణ ప్రభుత్వముచే గుర్తించబడి మెప్పుపొందిన ఘనత టీపాడ్ కి దక్కడం గర్వ కారణం వేసవి లో వెచ్చని వనభోజనాలు పచ్చని వనంలో ప్రతీ ఏటా జరుపుతూ వేల కుటుంబాల సంబంధ బాంధవ్యాలఅమరికకు పెద్దరికాన్ని ప్రేమతో నిలబెట్టుకుంటుంది. ప్రతీ ఏటా రక్త దాన శిబిరాలు నిర్వహిస్తూ ప్రాణాధాత గా వ్యవహరిస్తోంది. యువతకి స్పూర్తినిస్తూ మాతృభూమిపై మమకారాలను పెంపొందిస్తూ, సేవా దృక్పథం కలిగిన నాయకులకి స్ఫూర్తిని కలుగజేసే “లీడర్ షిప్ స్కిల్స్ వర్కుషాప్స్”లాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ముందుకు కొనసాగుతుంది. టీపాడ్ 2019 ఎన్నుకొనబడిన కొత్త కార్యవర్గ బృందం ప్రమాణస్వీకారాల సభ మినర్వా బాన్క్వెట్ హాల్ , ప్లేనో నగరములో నిర్వహించారు. డాలస్ ప్రాంతీయులు, అన్ని స్థానిక మరియు తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసారు. ముందుగా డాలస్ చిన్నారులు అవని సుంకిరెడ్డి, సిందూరి కోడూరి, నిగమా రెడ్డి కొండ ప్రార్థన మరియు అమెరికా, భారత దేశం జాతీయ గీతాలు ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అటు తరువాత రఘువీర్ రెడ్డి బండారు(2018 ఫౌండేషన్ కమిటీ చైర్), శారద సింగిరెడ్డి (2018 బోర్డు అఫ్ ట్రస్టీ చైర్ 2018), శ్రీనివాస్ గంగాధర (2018 ప్రసిడెంట్) , ఇంద్రాణి పంచార్పుల (2018 ఎగ్జిక్యూటివ్ కమిటీ కోఆర్డినేటర్) సంయుక్తంగా 2018లో నిర్వహించిన కార్యక్రమాల విజయాన్ని సభకి తెలుపుతూ పనిచేసిన కార్యవర్గాన్ని ప్రశంసిస్తూ అభినందనలు తెలియచేసారు. తదనంతరము రఘువీర్ రెడ్డి బండారు జానకిరామ్ రెడ్డి మందాడి 2019 ఫౌండేషన్ కమిటీ చైర్ గా , రాజ వర్ధన్ రెడ్డి గొంది 2019 ఫౌండేషన్ కమిటీ వైస్ చైర్ గా, రామ్ రెడ్డి అన్నా డి ఫాండషన్ కమిటీ మెంబెర్ గా , అశోక్ రెడ్డి కొండల ఫౌండేషన్ కమిటి మెంబెర్ గా వారిచే ప్రమాణ స్వీకారాలను చేయించారు. శారద సింగిరెడ్డి గోలి బుచ్చి రెడ్డి బోర్డు అఫ్ ట్రస్టీ చైర్ మెంబెర్ గా, పవన్ గంగాధర 2019 బోర్డు అఫ్ ట్రస్టీ చైర్ గా , మాధవి సుంకిరెడ్డి 2019 బోర్డు అఫ్ ట్రస్టీ వైస్ చైర్ గా, సుధాకర్ రెడ్డి కలసాని 2019 ఎగ్జిక్యూటివ్ కమిటీ కోఆర్డినేటర్ గా వారిచే ప్రమాణ స్వీకారాలను చేయించారు. శ్రీనివాస్ గంగాధర చంద్రా రెడ్డి పోలీస్ 2019 ప్రెసిడెంట్ గా, రవికాంత్ రెడ్డి మామిడి 2019 వైస్ ప్రెసిడెంట్ గా , మాధవి రెడ్డి లోకిరెడ్డి 2019 జనరల్ సెక్రటరీ గా , లక్ష్మి పోరెడ్డి 2019 జాయింట్ సెక్రటరీ గా , అనురాధ మేకల 2019 ట్రెసరర్ గా , శంకర్ పరిమళ్ 2019 జాయింట్ ట్రేసరర్ గా, రత్న ఉప్పల ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్ గా వారిచే ప్రమాణ స్వీకారాలను చేయించారు.

టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్ జానకిరామ్ రెడ్డి మందాడి 2019 సంవత్సరములోకొనసాగే కార్య వర్గబృందం ఫౌండేషన్ కమిటీగా వ్యవహరిస్తున్న రాజవర్ధన్ రెడ్డి గొంది , అజయ్ రెడ్డి, మహేందర్ కామిరెడ్డి,రఘువీర్ రెడ్డి బండారు ,రావు కలవల , ఉపేందర్ తెలుగు, రామ్ రెడ్డి అన్నాడి , అశోక్ రెడ్డి కొండల లను, బోర్డు అఫ్ ట్రస్టీ కమిటీగా వ్యవహరిస్తున్న పవన్ కుమార్ గంగాధర,మాధవి సుంకిరెడ్డి , సుధాకర్ కలసాని, బుచ్చిరెడ్డి గోలి, ఇంద్రాణి పంచార్పుల,శారద సింగిరెడ్డి లను, ఎగ్జిక్యూటివ్ కమిటీగా వ్యవహరిస్తున్న చంద్రా రెడ్డి పోలీస్,శ్రీనివాస్ గంగాధర,రవికాంత్ రెడ్డి మామిడి,మాధవి లోకిరెడ్డి, లక్ష్మి పోరెడ్డి, అనురాధ మేకల, శంకర్ పరిమళ్, దీప్తి సూర్యదేవర,లింగా రెడ్డి అల్వా, మధుమతి వ్యాసరాజు, రత్న ఉప్పల, రోజా అడెపు,రూప కన్నెయ్యగారి,శరత్ ఎర్రం, శ్రీనివాస్ వేముల లను అడ్వైసరి కమిటీగా వ్యవహరిస్తున్న అరవింద్ రెడ్డి ముప్పిడి, గంగా దేవర, జయ తెలకల పల్లి,కరణ్ పోరెడ్డి,నరేష్ సుంకిరెడ్డి,రమణ లష్కర్,సంతోష్ కోరె, సతీష్ నాగిళ్ల , సురేందర్ చింతల,వేణు భాగ్యనగర్,విక్రమ్ రెడ్డి జంగం,కళ్యాణి తాడిమేటి లను, కొలాబరేషన్ కమిటీగా వ్యవహరిస్తున్న అనూష వనం,అపర్ణ కొల్లూరి, అపర్ణ సింగిరెడ్డి,ధన లక్ష్మి రావుల,గాయత్రి గిరి,జయశ్రీ మురుకుట్ల,కవిత బ్రహ్మదేవర,మాధవి మెంట,మాధవి ఓంకార్, మంజుల తొడుపునూరి,నితిన్ చంద్ర, రవీంద్ర ధూళిపాళ, శశి రెడ్డి కర్రి,శరత్ పు న్ రెడ్డి, శ్రవణ్ నిధిగంటి , శ్రీధర్ కంచర్ల,శ్రీకాంత్ రౌతు,శ్రీనివాస్ అన్నమనేని,శ్రీనివాస్ కూటికంటి,శ్రీనివాస్ తుల,స్వప్న తుమ్మపాల, తిలక్ వన్నంపుల, వంశి కృష్ణ, వందన గౌరు లను వేదిక పైకి ఆహ్వానించి అభినందనలు తెలియచేసారు. కార్యక్రమములో చివరిగా ఫౌండేషన్ కమిటి బృందం అజయ్ రెడ్డి, రఘువీర్ రెడ్డి బండారు, రావు కలవల, జానకిరామ్ రెడ్డి మందాడి, రామ్ రెడ్డి అన్నాడి, అశోక్ రెడ్డి కొండల “తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్” సంస్థ ప్రెసిడెంట్ (2019-2020) గా ఎన్నికైన విక్రమ్ రెడ్డి జంగం మరియు “నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్” ప్రెసిడెంట్ (2021-2022) ) గా ఎన్నికైన శ్రీధర్ రెడ్డి కొరసపాటిని పుష్పగుచ్ఛాలతో సత్కరించి, శాలువాతో సన్మానించి తెలుగు సంస్థలకు వారిరువురు చేస్తున్నటువంటి సేవలను కొనియాడారు.

బోర్డు అఫ్ ట్రస్టీ వైస్ చైర్ మాధవిసుంకిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ కోఆర్డినేటర్ సుధాకర్ కలసాని కార్యక్రమానికి వొచ్చిన అతిథులందరికి, ప్రసార మాధ్యమాలు మీడియా మరియు బసేరా ఇండియన్ రెస్టారెంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top