ఘనంగా ఆటా-నాష్‌విల్లే మహిళా దినోత్సవ వేడుకలు

ATA And ICON Conducted International Women's Day 2019 In Nashville - Sakshi

నాష్‌విల్లే : అమెరికా తెలుగు అసోసియేషన్‌(ఆటా), ఇండియన్‌ కమ్యూనిటీ ఆఫ్‌ నాష్‌విల్లే(ఐసీఓఎన్‌)లు సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను  ఘనంగా నిర్వహించాయి. నాష్‌విల్లేలోని వాండెర్‌బిల్ట్‌ విశ్వవిద్యాలయ వేదికగా రాధిక రెడ్డి, లావణ్య రెడ్డి, బిందు మాధవి, శిరీష కేస, రవళి కల్లు తదితరుల ఈ వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం అధ్యక్షురాలు చల్లా కవిత హాజరయ్యారు. మహిళా దినోత్సవంలో భాగంగా ఆటా, ఐసీఓఎన్‌లు  పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాయి. ఇందులో భాగంగా మహిళలు తమ ప్రతిభకు పదును పెడుతూ పోటాపోటీగా ఆటపాటలతో అలరించారు. షాపింగ్‌ మేళాను నిర్వహంచారు. ఇండియన్‌ స్పెషల్‌ వంటకాలు, డ్యాన్స్‌లు, పాటలతో సభా ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఇండియన్ రిజినల్‌ లాంగ్వేజస్‌, కమ్యూనిటీ సర్వీస్‌లో కృషి చేసిన మహిళలు గ్రీష్మా బినోష్‌, హారిక కనగాల, కిరుతీగ వాసుదేవన్‌, శ్యామలి ముఖర్జీ, రచన కెడియా అగర్వాల్‌, డాక్టర్‌ అరుందతి రామేష్‌లను ఆటా సన్మానించింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆటా బోర్డు సభ్యులు జయంత్‌ చల్లా, అనిల్‌ బోడిరెడ్డి, రామకృష్ణారెడ్డి ఆళ్ల, శివ రామడుగు, సుశీల్‌ చందా, శ్రీహాన్‌ నూకల, నరేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top