
న్యూయార్క్ : భారతసంతతికి చెందిన అవ్నీత్ కౌర్(20) అనే యువతిపై జరిగింది విద్వేశ పూరిత దాడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెలలో తన స్నేహితురాలితో కలిసి మాన్‌హట్టన్‌లో సబ్‌వే ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా అల్లాషీద్ (54) అనే న్యూయార్క్‌కు చెందిన వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. కౌర్‌తో పాటూ ఆమె స్నేహితురాలిని అల్లాషీద్ అసభ్య పదజాలంతో దూషించడంతో వారు అతడికి దూరంగా వెళ్లడానికి ప్రయత్నించారు. వారిద్దరిని వెంబడించి మరీ అల్లాషీద్ కౌర్‌పై దాడికి దిగాడు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ ఘటనలో నిందితుడి నేరం రుజువైతే మూడున్నరేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉందని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ రిచర్డ్ బ్రౌన్ తెలిపారు.