రైల్లో పైశాచికత్వం, బయట నిర్లక్ష్యం

Young Women Intolerance in Social Media on Karnatka Police - Sakshi

రైల్లో యువతిపై వృద్ధుడి అసభ్య ప్రవర్తన

ఫిర్యాదు స్వీకరణకు నిరాకరణ

మూడు పోలీస్‌ స్టేషన్లు తిప్పిన పోలీసులు  

పోలీసుల తీరుపై ఫేస్‌  బుక్‌లో యువతి అసహనం

కృష్ణరాజపురం : రైలులో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు కూడా నిర్లక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ యువతి ఫేస్‌బుక్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఇంజనీర్‌గా పని చేస్తున్న యువతి ఈనెల17వ తేదీన విధులు ముగిసిన అనంతరం రైలులో స్నేహితులతో కలసి కేజీఎఫ్‌ పట్టణానికి వెళుతున్నారు. రైలు బయలుదేరిన కొద్దిసేపటికి యువతి నిద్రలోకి జారుకోవడాన్ని గమనించిన వెనుకసీటులో కూర్చున్న 55 ఏళ్ల వ్యక్తి యువతి వెనుకభాగాన్ని తడుముతూ అసభ్యంగా ప్రవర్తించాడు.

వెంటనే మేల్కొన్న యువతి వ్యక్తిని ప్రశ్నించగా మరింత అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పక్క బోగీలో ఉన్న తన స్నేహితులను పిలవడానికి ప్రయత్నించగా అంతలోపు వ్యక్తి వైట్‌ఫీల్డ్‌ స్టేషన్‌లో దిగి పారిపోయాడు. దీనిపై వైట్‌ఫీల్డ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా తమ పరిధిలోకి రాదని అడుగోడి పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ సూచించారు. దీంతో అడుగోడి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని తనకు ఎదురైన అనుభవాన్ని వివరించి కేసు నమోదు చేసుకోవాలంటూ విన్నవించగా ఘటన తమ పరిధిలోకి రాదని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ అక్కడి నుంచి కూడా పంపించేశారు. అక్కడి నుంచి నేరుగా కంటోన్మెంట్‌ పోలీసులకు ఘటన గురించి వివరించి కేసు నమోదు చేసుకోవాలంటూ విన్నవించగా ఫోటో ఉందా, అడ్రస్‌ ఉందా, వ్యక్తి పేరేంటి ఇలా నిర్లక్ష్యంగా ప్రశ్నలు వేసి కేసు నమోదు చేసుకోవానికి నిరాకరించారంటూ ఫేస్‌బుక్‌లో బాధను వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్‌ పోస్ట్‌ను కేంద్ర రైల్వేశాఖతో పాటు మహిళ శిశు సంక్షేమశాఖకు కూడా ట్యాగ్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top