గోరఖ్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్న యోగీ | Yogi Adityantha Gorakhnath Math Gaushala | Sakshi
Sakshi News home page

గోరఖ్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్న యోగీ

May 13 2017 10:02 AM | Updated on Sep 5 2017 11:05 AM

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ శనివారం గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించారు.

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యానాథ్ శనివారం ఉదయం గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఉన్న గోశాలను  సందర్శించారు. గోవులకు ముఖ్యమంత్రి దాణా తినిపించారు. ఈ గోశాలలో  సుమారు 500 ఆవులు ఉన్నాయి.

ఈ సందర్భంగా గోశాల సంరక్షకుడు శివ్ పార్సెన్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి గోశాలను సందర్శించారని, బెల్లం, బిస్కెట్లు, పండ్లు, దాణాను గోవులకు తినిపించినట్లు తెలిపారు. అలాగే పలు గోవులకు ఆయన పేర్లు పెట్టారు. గతంలోనూ సీఎం యోగీ గోశాలను దర్శించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement