డ్రైవింగ్ లైసెన్స్‌ కోసం పోటెత్తిన మహిళలు | womens applications for driving licence | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్ లైసెన్స్‌ కోసం పోటెత్తిన మహిళలు

Jan 31 2018 8:28 AM | Updated on Jan 31 2018 8:33 AM

womens applications for driving licence - Sakshi

మహిళలు పాతచిత్రం

టీ.నగర్‌: సబ్సిడీ ధరలపై స్కూటర్‌ పథకం అమలు కావడంతో డ్రైవింగ్‌ లైసెన్సులు పొందేందుకు మహిళా ఉద్యోగులు ఆర్‌టీఓ కార్యాలయం బాట పడుతున్నారు. ప్రయివేటు సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు కార్యాలయానికి సులభంగా వెళ్లేందుకు వీలుగా ద్విచక్ర వాహనాలపై 50శాతం సబ్సిడీ లేదా రూ.25వేల నగదు అందజేసే పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. తిరువణ్ణామలై జిల్లాలో దరఖాస్తులను గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం, మున్సిపల్, పట్టణ పంచాయతీ జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో ఫీజులు లేకుండా పొందవచ్చు.

పూర్తి చేసిన దరఖాస్తును సమర్పించేందుకు ఫిబ్రవరి 5వ తేదీ వరకు గడువు ఉంది. ద్విచక్ర వాహనాలను సబ్సిడీపై పొందేందుకు అనేక నిబంధనలు ఉన్నాయి. తప్పనిసరిగా డ్రైవింగ్‌లైసెన్స్‌ కలిగిఉండాలి. దీంతో మహిళా ఉద్యోగులు డ్రైవింగ్‌ లైసెన్స్‌ల కోసం ఆర్‌టీఓ కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు. సోమవారం తిరువణ్ణామలై ఆర్‌టీఓ కార్యాలయంలో 555 మందికి డ్రైవింగ్‌ లైసెన్స్‌లు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement