టార్చర్‌ పెడుతున్నాడు.. విడాకులు ఇప్పించండి

Woman Files Divorce Plea Against Husband Who Fat Shamed Her - Sakshi

లక్నో: తెలుగులో కొన్నేళ్ల  క్రితం ఓ సినిమా వచ్చింది. దానిలో తల్లిదండ్రుల బలవంతం మేరకు హీరో లావుగా ఉన్న మహిళను వివాహం చేసుకోవాల్సి వస్తుంది. దాంతో వివాహం అయిన నాటి నుంచి ఆ మహిళను లావుగా ఉన్నావ్‌ అంటూ విమర్శించడమే కాక ఆమెతో కలిసి బయటకు ఎక్కడకు వెళ్లడు. సరిగా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళకు. భర్త వేధింపులతో విసిగిపోయిన సదరు మహిళ విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది. ఆ వివరాలు.. బిజ్నోర్‌కు చెందిన ఓ మహిళకు మీరట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో 2014లో వివాహం అయ్యింది. కొద్ది రోజులు వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత సదరు వ్యక్తి లావుగా ఉన్నావంటూ భార్యను వేధించడం ప్రారంభించాడు. తనతో పాటు ఎక్కడికి తీసుకెళ్లేవాడు కాదు. ఆమెను ఎక్కడికి పంపే వాడు కాదు.

అంతేకాక ఇంటికి ఎవరైనా బంధువులు, స్నేహితులు వస్తే వారి ముందే ఆమెను అవమానించేవాడు. అంతటితో ఊరుకోక తనతో కలిసి మద్యం సేవించాల్సిందిగా సదరు మహిళను బలవంతం చేసేవాడు. అందుకు ఆమె అంగీకరించకపోతే కొట్టేవాడు. ఈ విషయాల గురించి బాధిత మహిళ తన తల్లిదండడ్రులకు, అత్తింటి వారికి కూడా చెప్పింది. కానీ అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. విసిగిపోయిన మహిళ భర్త పెట్టే టార్చర్‌ను తట్టుకోలేక పోతున్నాను.. విడాకులు ఇప్పించండి అంటూ ఘజియాబాద్‌ కోర్టును ఆశ్రయించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top