‘పనామా’పై మౌనమేల? | Why silent on Panama | Sakshi
Sakshi News home page

‘పనామా’పై మౌనమేల?

Apr 9 2016 1:27 AM | Updated on Aug 15 2018 6:32 PM

‘పనామా’పై మౌనమేల? - Sakshi

‘పనామా’పై మౌనమేల?

నల్లధనాన్ని వెనక్కి తెస్తానని పెద్దపెద్ద హామీలిచ్చిన ప్రధానమంత్రి మోదీ అందుకు అవసరమైన చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.

కమల్‌పూర్(అస్సాం):  నల్లధనాన్ని వెనక్కి తెస్తానని పెద్దపెద్ద హామీలిచ్చిన ప్రధానమంత్రి మోదీ అందుకు అవసరమైన చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. పనామా పేపర్లలో ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కుమారుడు అభిషేక్ సింగ్ పేరు వెలుగులోకి వచ్చినా..ఎందుకు దర్యాప్తు ప్రారంభించలేదని ప్రశ్నించారు. అస్సాంలో ఈ నెల 11న రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ శుక్రవారంలో పాల్గొన్నారు.

పనామాలో నల్లధనం దాచిన అనేక మంది పేర్లు వెలుగు చూశాయని, ఇందులో అభిషేక్‌కు పనామాలో అకౌంట్ ఉందని వెల్లడైందని చెప్పారు. దేశం వదిలి పారిపోయిన మాజీ ఐపీఎల్ చీఫ్ లలిత్‌మోదీని తిరిగి స్వదేశానికి ఎందుకు రప్పించలేదని మోదీని పార్లమెంట్‌లో ప్రశ్నించానని, అయితే ఆయన నోరు విప్పలేదని అన్నారు. వేల కోట్లు కొల్లగ్గొట్టిన విజయ్‌మాల్యా దేశాన్ని వదిలి పారిపోయే ముందు పార్లమెంట్ హౌస్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement