పాక్ గూఢచారి పావురాల కలకలం | white pigeon from Pakistan triggers flutter in village near border | Sakshi
Sakshi News home page

పాక్ గూఢచారి పావురాల కలకలం

May 29 2015 11:42 AM | Updated on Sep 3 2017 2:54 AM

పంజాబ్ పోలీసులకు చిక్కిన పాకిస్థాన్ గూఢచార పావురం రెక్కలపై రాతలు. ( ఇన్సెట్: పావురాన్ని ఎక్స్-రే పరీక్షలకు తీసుకెళుతోన్న పోలీసులు)

పంజాబ్ పోలీసులకు చిక్కిన పాకిస్థాన్ గూఢచార పావురం రెక్కలపై రాతలు. ( ఇన్సెట్: పావురాన్ని ఎక్స్-రే పరీక్షలకు తీసుకెళుతోన్న పోలీసులు)

కమలహాసన్ తీసిన 'విశ్వరూపం' సినిమాలో ఉగ్రవాదులు పావురాల ద్వారా రహస్య సమాచారాలతోపాటు యురేనియం వంటి అణు ధార్మిక పదార్థాల్ని శత్రుదేశాలకు చేర్చి, అక్కడ పేలుళ్లకు పాల్పడుతూ ఉంటారు.. సరిగ్గా అదే తరహాలో భారత గగనతలంపై ఎగురుతూ కనిపిస్తున్నాయి పాక్ గూఢచార పావురాలు..

- పాకిస్థాన్ నుంచి పక్షుల ద్వారా రహస్య సమాచారం బట్వాడా
- మూడు నెలల్లో పోలీసుల చేతికి చిక్కిన రెండు పావురాలు
- 'విశ్వరూపం' తరహా దాడులకు దయాది దేశం కుట్ర!


కమలహాసన్ తీసిన 'విశ్వరూపం' సినిమాలో ఉగ్రవాదులు పావురాల ద్వారా రహస్య సమాచారాలతోపాటు యురేనియం వంటి అణు ధార్మిక పదార్థాల్ని శత్రుదేశాలకు చేర్చి, అక్కడ పేలుళ్లకు పాల్పడుతూ ఉంటారు. పావురాల ద్వారా సమాచారం బట్వాడా కొత్తవిషం కానప్పటికీ, దాయాది దేశం నుంచి తరచూ అలాంటివి ఎగిరివస్తుండటం వెనుక కచ్చితంగా కుట్రకోణం దాగుందని భావిస్తున్నాయి భారత భద్రతా బలగాలు.

గురువారం భారత్- పాక్ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో కనిపించిన తెలుపురంగు పావురం ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లా మన్వాల్ గ్రామస్తుడు రమేశ్ చంద్.. తన ఇంటిమీదుగా వెళుతోన్న ఓ పావురాన్ని పట్టుకున్నాడు. పరీక్షించి చూడగా, దాని రెక్కలపై వేవేవో అక్షరాలు రాసున్నాయి. దీంతో అనుమానం వచ్చి స్థానిక పోలీలకు సమాచారం ఇచ్చాడు. పావురాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని రెక్కలపై 'తహశీల్ షకార్గంజ్, జిల్లా నరోవాల్' అని ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో రాసి ఉండటాన్ని గుర్తించారు.

రెట్టింపు అనుమానంతో సదరు పావురానికి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించారు. అయితే అనుమానిత పదార్థాలేవీ బయటపడన్నప్పటికీ పావురం రెక్కలపై ఉన్న రాతలు ఏదైనా రహస్య సమాచారానికి సంబంధించినవా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పఠాన్ కోట్ ఎస్పీ రాకేశ్ కౌషల్ తెలిపారు. ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఏజెన్సీలతోపాటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు సమాచారం అందించి  అప్రమత్తం చేశామన్నారు.

మూడునెలల కిందట గుజరాత్లోని ద్వారకా జిల్లాలోనూ ఇలాంటిదే ఓ పావురం భద్రతా బలగాలకు చిక్కింది. దాని నుంచి 'బెంజింగ్ దువాల్' అని రాసిఉన్న ఒక ఎలక్ట్రానిక్ చిప్, '28733' నంబర్ ముద్రించిన ఓ ఉంగరం, రెక్కల మధ్యలో 'రసూల్- ఉల్- అల్లాహ్' అని అరబిక్ భాషలో రాసిఉన్న సందేశాన్ని గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement