అగ్నిమాపక శాఖ మంత్రికి కరోనా పాజిటివ్‌ | West Bengal Minister Tests Covid-19 Positive | Sakshi
Sakshi News home page

అగ్నిమాపక శాఖ మంత్రికి కరోనా పాజిటివ్‌

May 29 2020 1:21 PM | Updated on May 29 2020 2:25 PM

West Bengal Minister Tests Covid-19 Positive - Sakshi

కోల్‌కతా: కరోనాకు ధనిక, పేద తేడా లేవు. హోదా, అధికారం అనే భేదం​ అసలే తెలియదు. తాజాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్ బోస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అతని భార్యకు కూడా కరోనా పాజిటివ్‌ తేలడంతో వారిద్దరినీ స్వీయ నిర్భందంలో ఉండాలని వైద్యులు సూచించారు.

అయితే మంత్రి సుజిత్ బోస్ గత కొద్ది రోజులుగా అంఫన్‌ తుఫాన్‌ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం మంత్రి కరోనా బారిన పడటంతో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా బెంగాల్‌లో ఇప్పటిదాకా.. 4,536 కరోనా కేసులు నమోదవ్వగా అందులో 229 మంది మరణించారు. మరో 1,668 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. చదవండి: మాతృభూమి ఎండీ కన్నుమూత; ప్రధాని సంతాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement