'ఒక్క రాహుల్ తప్ప అంతా ఖండించారు' | we will tak action who were attack on roypoor church | Sakshi
Sakshi News home page

'ఒక్క రాహుల్ తప్ప అంతా ఖండించారు'

Mar 7 2016 12:06 PM | Updated on Sep 3 2017 7:12 PM

రాయ్పూర్లో చర్చిపై దాడి ఘటనలో పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.

ఛత్తీస్గఢ్: రాయ్పూర్లో చర్చిపై దాడి ఘటనలో పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ రాయ్ పూర్ చర్చిపై దాడి చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు.

మరోపక్క, జేఎన్యూ ఘటనపై కూడా స్పందిస్తూ జేఎన్యూ ఘటనను ఒక్క రాహుల్ గాంధీ తప్ప దేశంలో అందరూ ఖండించారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. తమది బాధ్యతాయుతమైన ప్రభుత్వం అని చెప్పిన ఆయన అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ముందుకు వెళతామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement