నిర్భయ చట్టం తెచ్చినా..

సాక్షి, న్యూఢిల్లీ : మహిళలపై వేధింపుల నిరోధానికి నూతన చట్టాలు తీసుకురావడం పరిష్కారం కాదని, రాజకీయ సంకల్పం, పాలనాపరమైన చర్యలు అవసరమని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, నిర్భయ చట్టం తీసుకువచ్చినా మహిళలపై నేరాలు ఆగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఉన్నావ్‌లో జరిగిన ఇటీవలి సంఘటలను ప్రస్తావిస్తూ కొద్దిరోజులుగా జరుగుతున్న ఘటనలు సిగ్గుచేటని, ఇలాంటి ఘటనలు తక్షణమే నిలిచిపోయేలా మనమంతా ప్రతినబూనాలని పిలుపు ఇచ్చారు. సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఆదివారం జరిగిన 16వ స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మహిళలపై నేరాల నియంత్రణకు నూతన చట్టాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం కాదని చెప్పారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి