రంగీలా తార ప్రచారానికి బాలీవుడ్‌ నటులు

Urmila Matondkar Says Bollywood Friends Have Promised Support - Sakshi

ముంబై : ఉత్తర ముంబై లోక్‌సభ స్ధానం నుంచి సార్వత్రిక ఎన్నికల బరిలో దిగిన బాలీవుడ్‌ నటి, కాంగ్రెస్‌ నేత ఊర్మిళా మటోండ్కర్‌ తనకు సాయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బాలీవుడ్‌ ఫ్రెండ్స్‌ పలువురు ముందుకొచ్చారని చెప్పారు. అయితే వీరందరిలో ఎంతమంది ప్రచారంలో పాల్గొంటారో చూడాలని రంగీలా నటి అన్నారు.

తనకు మద్దతుగా ఏ కొద్ది మంది ప్రచారంలో పాల్గొన్నా సంతోషమేనని, వారు ప్రచారంలో పాల్గొనకపోయినా మంచిదేనని చెప్పుకొచ్చారు. ఉత్తర ముంబై నియోజకవర్గం నుంచి పోటీలో దిగిన ఊర్మిళ ఎన్నికల ప్రచారం చేపట్టారు. పలు ప్రార్ధనా స్ధలాలనూ ఆమె సందర్శించారు. రాజకీయ ప్రస్ధానం ఇప్పుడే మొదలైందని, తనకింకా విసుగు రాలేదని చెప్పారు. సినీ రంగంలోనూ తాను ఎంతో కష్టపడి పేరుతెచ్చుకున్నానని, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తానని అన్నారు. నిజాయితీతో పనిచేయడమే తన విలక్షణతని ప్రజలు తనను ఎన్నుకుంటే వారికి నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top