మోదీపై శివసేన ఫైర్ | Uri Terror Attack: Shiv Sena Needles PM, Says Situation Worse Than Congress Rule | Sakshi
Sakshi News home page

మోదీపై శివసేన ఫైర్

Sep 19 2016 6:23 PM | Updated on Aug 25 2018 3:57 PM

మోదీపై శివసేన ఫైర్ - Sakshi

మోదీపై శివసేన ఫైర్

శివసేన మరోసారి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పై తీవ్ర స్థాయిలో మండిపడింది.

ముంబై: శివసేన మరోసారి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పై తీవ్ర స్థాయిలో మండిపడింది. మోదీ పనితీరు గత కాంగ్రెస్ పాలన కంటే దారుణంగా ఉందని అందుకే  ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని శివసేన అధికార పత్రిక సామ్నాలో విమర్శించింది. మోదీ అంతర్జాతీయంగా పాకిస్థాన్ చర్యలను ఎండగట్టడంలో విఫలమయ్యారని ఆరోపించింది.

కశ్మీర్ లో నిరంతరం పాకిస్థాన్ జెండా ఎగరడం, అనుకూల నినాదాలు వినిపిస్తుండటం పరిపాటిగా మారిందని పేర్కొంది. పఠాన్ కోట్ దాడి అనంతరం సరైన చర్యలు తీసుకోకపోవడమే యురీ ఘటనకు కారణమని స్పష్టం చేసింది. ఉగ్రదాడికి సాక్షాలను అంతర్జాతీయంగా చూపినా లాభం ఉండదని ఒసామా బిన్ లాడెన్ ను ఏరివేసేందుకు అమెరికా పాక్ లో చేసిన దాడిని గుర్తు చేసింది. భారత్  తన సైన్యాలను పాక్ పై ప్రయోగించాలని డిమాండ్ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement