'యూపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందే' | UP fit case for President rule, says R K Singh | Sakshi
Sakshi News home page

'యూపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందే'

Jun 4 2014 3:10 PM | Updated on Jul 30 2018 8:27 PM

ఉత్తరప్రదేశ్లో వరుసపెట్టి జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను చూస్తుంటే అక్కడ పరిపాలన పూర్తిగా స్తంభించిందని, అందువల్ల అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని హోంశాఖ మాజీ కార్యదర్శి, బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ అన్నారు.

ఉత్తరప్రదేశ్లో వరుసపెట్టి జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను చూస్తుంటే అక్కడ పరిపాలన పూర్తిగా స్తంభించిందని, అందువల్ల రాష్ట్రపతి పాలన విధించడానికి అనువైన పరిస్థితులన్నీ అక్కడ ఉన్నాయని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి, బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ అన్నారు. అక్కడి ప్రభుత్వం విఫలమైందని, శాంతిభద్రతలు అన్నవే లేవని, హత్యలు, అత్యాచారాలు సర్వసాధారణం అయిపోయాయని సింగ్ చెప్పారు. అందుకే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని అన్నారు.

రాష్ట్ర పరిపాలనలోని ప్రతి విభాగంలోను రాజకీయ జోక్యం బాగా ఎక్కువైపోయిందని, ముఖ్యంగా పోలీసు విభాగంలోనూ రాజకీయ జోక్యం ఉండటంతో పాలన కుప్పకూలిందని సింగ్ విశ్లేషించారు. అలీగఢ్లో ఓ మహిళా జడ్జిపై అత్యాచారం, హత్య సంఘటనను ఆయన ప్రస్తావిస్తూ, చివరకు జడ్జికి కూడా.. తన సొంతింట్లోనూ రక్షణ లేదని, ఇలాగైతే ఎలాగని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement