
న్యూఢిల్లీ: పంట పొలాలకు నీరు అందకపోతే డ్యాంలు నిర్మించి ఏం లాభమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ప్రశ్నించారు. డ్యాంలలోని నీటిని 100 శాతం వినియోగించుకోవాలని, దీనికి పైపులు, డ్రిప్ తదితర పద్ధతులు పాటించాలన్నారు.
మంగళవారం ఢిల్లీలో కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ (సీఏడీ)పై జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద రూ.78 వేల కోట్లతో 99 ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించామన్నారు. కానీ గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్టు సీఏడీ పనుల కోసం రూ.2 వేల కోట్ల ప్రతిపాదనలు, తెలంగాణ నుంచి రూ.12 కోట్ల ప్రతిపాదనలు మాత్రమే వచ్చాయని తెలిపారు.