విగ్రహాలు, పవిత్ర గ్రంథాలను తాకకూడదు: కేంద్రం

Under New Rules No Prasad And Holy Water In Religious Places - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా దాదాపు 2 నెలల నుంచి దేశంలోని ఆలయాలన్ని మూసి వేశారు. లాక్‌డౌన్‌ 5.0లో దేశవ్యాప్తంగా ఈ నెల 8నుంచి కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వనుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థన స్థలాలను తెరిచేందుకు అనుమతివ్వనున్నారు. దీనికి అనుగుణంగా కేంద్రం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. (సకల జాగ్రత్తలతోనే పునఃప్రారంభించాలి)

1. ప్రార్థన మందిరాలల్లోకి వచ్చేందుకు, వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఉండాలి.
2. ప్రవేశ మార్గంలో శానిటైజర్‌, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్‌ తప్పనసరి.
3. ప్రార్థన మందిరాలకు వచ్చేవారిని దశలవారిగా పంపించాలి. క్యూలైన్లో 2 మీటర్ల భౌతిక దూరం పాటించేలా చూడాలి.
4. భక్తి గీతాలను ఆలపించడానికి వీలులేదు. బదులుగా  రికార్డు చేసినవి వినిపించాలి.
5. ప్రసాదం, తీర్థం ఇవ్వడం, పవిత్ర జలం చల్లడం చేయకూడదు.
6. అన్న ప్రసాదం తయారు చేసే సమయంలో, పంచేటప్పుడు భౌతిక దూరం తప్పని సరి.
7. విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను తాకకుండా చూడాలి.
8. మతపరమైన సమావేశాలు, జనాలు గుంపులుగా చేరే వేడుకలు నిర్వహించడం నిషేధం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top