ఒంటి చేత్తో మాస్కులు కుట్టిన సింధూరి

Udipi girl stich masks with single hand - Sakshi

మంగుళూరు: ఒంటి చేత్తో ఫేస్ మాస్కులు కుట్టి పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అందిస్తున్న ఓ పదేళ్ల బాలిక శభాష్ అనిపించుకుంటోంది. ఉడిపికి చెందిన సింధూరికి పుట్టుకతోనే ఓ చేయి లేదు. మౌంట్ రోసరీ అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆరో తరగతి చదువుతోంది. (మా పేరు ‘కరోనా’ కాదు.. మేం భారతీయులమే)

ప్రజల కోసం ఆ స్కూల్ కు చెందిన స్కౌట్ అండ్ గైడ్స్ డిపార్ట్ మెంటు లక్ష మాస్కులను కుట్టి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా సింధూరి 15 మాస్కులను ఒంటి చేత్తో తయారు చేసింది. వీటిని పదో తరగతి పరీక్షలు రాస్తున్న స్టూడెంట్స్ కు అందజేశారు. (పీఎఫ్ ఖాతాదారులకు మరో షాక్?)

మొదట్లో ఒంటి చేత్తో కుట్టేందుకు ఇబ్బంది పడ్డానని, అమ్మ సాయంతో చేయగలిగానని సింధూరి తెలిపింది. మాస్కులు కుట్టి అందజేసినందుకు అందరూ తనను అభినందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top