ప్రయాణికురాలిపై వేధింపులు.. ఉబర్ డ్రైవర్ అరెస్టు | Uber Driver Arrested For Molesting Woman Passenger In Delhi | Sakshi
Sakshi News home page

ప్రయాణికురాలిపై వేధింపులు.. ఉబర్ డ్రైవర్ అరెస్టు

Dec 22 2016 8:20 AM | Updated on Sep 29 2018 5:26 PM

ప్రయాణికురాలిపై వేధింపులు.. ఉబర్ డ్రైవర్ అరెస్టు - Sakshi

ప్రయాణికురాలిపై వేధింపులు.. ఉబర్ డ్రైవర్ అరెస్టు

ఢిల్లీ ఎయిర్‌పోర్టు సమీపంలో ఒక మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా మాట్లాడి, ఆమెపై దాడి చేసినందుకు ఉబర్ క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఢిల్లీ ఎయిర్‌పోర్టు సమీపంలో ఒక మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా మాట్లాడి, ఆమెపై దాడి చేసినందుకు ఉబర్ క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 32 ఏళ్ల మహిళ ఎయిర్‌పోర్టు నుంచి పాలమ్ ప్రాంతానికి వెళ్లేందుకు సాయంత్రం 5 గంటలకు క్యాబ్ బుక్ చేసుకున్నారు. డ్రైవర్ రాజీవ్ (36) అక్కడకు ఆలస్యంగా రావడంతో ఆమె అతడితో వాగ్వాదానికి దిగారు. 
 
ఆ తర్వాత ఏరోసిటీ మీదుగా వెళ్లడానికి బదులు ఆ డ్రైవర్ ఆమెను మహిపాల్‌పూర్ రోడ్డుకు తీసుకెళ్లాడు. అదేంటని అడిగితే అతడికి కోపం వచ్చి, ఆమె మీద హ్యాండ్ బ్యాగ్ విసిరేసి తిట్టడమే కాక.. తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ కంటోన్మెంటు సమీపంలోనే ఆమెను కారు నుంచి దిగిపోవాలని చెప్పాడు. ఆమె వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement