పుల్వామాలో ఇద్దరు టెర్రరిస్టులు హతం

Two Terrorists Killed By CRPF Encounter In Pulwama - Sakshi

కశ్మీర్‌: జమ్ము- కశ్మీర్‌లో మారోసారి కాల్పుల మోత మోగింది. పుల్వామా జిల్లాలో శుక్రవారం ఎన్‌కౌంటర్‌ జరిపిన భద్రతా బలగాలు.. ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టారు. ఇంటలిజెన్స్‌ సమాచారం మేరకు దక్షిణ కశ్మీర్‌లోని అవంతీపురా జిల్లాలో భద్రతా బలగాలు కార్డన్‌సర్చ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడటంతో.. ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. 

ఈ నేపథ్యంలో వారి వద్ద లభించిన మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే వీరు ఏ సంస్థకు చెందినవారో గుర్తించేందుకు విచారణ చేపట్టామన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అవంతీపురా జిల్లా పరిధిలోని రైలు, ఇంటర్‌నెట్‌ సర్వీస్‌లను నిలిపివేసినట్లు వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top