సాగు సంక్షోభం, నిరుద్యోగం కీలకం

Two reports to the Prime Minister on the Gujarat elections - Sakshi

గుజరాత్‌ ఎన్నికలపై ప్రధానికి రెండు నివేదికలు

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలపై సమగ్ర విశ్లేషణతో కూడిన 2 నివేదికలు ప్రధాని మోదీకి చేరాయి. వీటిలో ఒకటి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) నివేదిక కాగా.. మరోటి ప్రత్యేక నిపుణుల కమిటీ నివేదిక. పార్టీ వర్గాల సమాచారం మేరకు... వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం గుజరాత్‌ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయని బీజేపీ నాయకత్వానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ సమస్యలకు పరిష్కారం చూపకుంటే లోక్‌సభ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య విభజన ఓటింగ్‌ సరళిపై ప్రభావం చూపినట్లు ప్రత్యేక కమిటీ పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ముఖాముఖి పోరు జరిగే రాష్ట్రాలకు సంబంధించి ఈ బృందం కొన్ని కీలక సూచనలు చేసింది.  ఈ ఎన్నికల్లో బీజేపీ నిరాశజనక ప్రదర్శన... మోదీపై వ్యతిరేక ఓటు లేక ప్రధాని నాయకత్వంపై రెఫరెండానికి సంకేతం కాదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top