నేడు, రేపు పలు రాష్ట్రాల్లో గాలి వానలు | Thunderstorm in north India hill states on Sunday | Sakshi
Sakshi News home page

నేడు, రేపు పలు రాష్ట్రాల్లో గాలి వానలు

May 13 2018 4:19 AM | Updated on May 13 2018 4:19 AM

Thunderstorm in north India hill states on Sunday - Sakshi

న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో ఆది, సోమవారాల్లో పెనుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం వెల్లడించింది. రాజస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో గాలి దుమారం చెలరేగే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురవొచ్చనీ, ఆ సమయంలో పెనుగాలులు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఐఎండీ పేర్కొంది. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా గాలివానలు పడే అవకాశం ఉందని ఓ ప్రకటనలో వెల్లడించింది. గత పక్షం రోజుల్లో  వర్షాలు, భీకర గాలి దుమారం కారణంగా ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌లలోనే 120 మందికి పైగా చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement