పట్టాలు తప్పిన అవధ్ - అసోం రైలు | Three coaches of Awadh-Assam Express jump rail in Bihar | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన అవధ్ - అసోం రైలు

Feb 8 2016 2:23 PM | Updated on Sep 3 2017 5:11 PM

బిహార్ లో ముజఫర్ పూర్ జిల్లాలో అవధ్ - అసోం ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.

పట్నా:  బిహార్ లో  ముజఫర్ పూర్  జిల్లాలో అవధ్ - అసోం  ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. బాగా రద్దీగా ఉండే హజీపూర్ - ముజఫర్ నగర్ మధ్య  సోమవారం  ఈ ప్రమాదం   చోటు చేసుకుంది.  దాదాపు మూడు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. మీరాపూర్ రైల్వే స్టేషన్ కు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో  కొన్ని మీటర్ల మేర ట్రాక్ దెబ్బతింది.  పలు రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో అధికారులు కొన్ని రైళ్లను దారి మళ్లించారు. అయితే ఎలాంటి  ప్రాణ నష్టం జరగలేదని.. పరిస్థితిని అంచనా వేస్తున్నామని ఈస్ట్ సెంట్రల్ రైల్వే  ఒక ప్రకటనలో తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement