అహ్మదాబాద్‌.. ఇకపై కర్ణావతి! | Thinking about renaming Ahmedabad as Karnavati | Sakshi
Sakshi News home page

అహ్మదాబాద్‌.. ఇకపై కర్ణావతి!

Nov 9 2018 4:04 AM | Updated on Nov 9 2018 4:04 AM

Thinking about renaming Ahmedabad as Karnavati - Sakshi

గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ

అహ్మదాబాద్‌: చాలాకాలంగా కాషాయ వర్గాలు డిమాండ్‌ చేస్తున్న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ పేరులో మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. అహ్మదాబాద్‌ పేరును కర్ణావతిగా మార్చే డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్నామని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ గురువారం తెలిపారు. రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో రూపానీ మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలలోపే ఈ నిర్ణయం అమలవుతుందని తెలిపారు. ‘అహ్మదాబాద్‌ అన్న పేరు బానిసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కర్ణావతి పేరు మన ఆత్మాభిమానాన్ని, సంస్కృతిని, స్వయం ప్రతిపత్తిని సూచిస్తుంది’’ అని డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement